పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
అమరుల స్ఫూర్తితో ప్రజా రక్షణకు అంకితభావంతో పనిచేయాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మహబూబాబాద్ :అక్టోబర్, 21: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, ఐఏఎస్, ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, ఐఏఎస్‌తో కలిసి అమర పోలీసులకు పుష్పాంజలి ఘటించి ఘన...