అపూర్వ కలయిక.. ఆత్మీయ బంధాల వేదిక.
* ఖమ్మంలో ఘనంగా గడల వంశీయుల సమ్మేళనం. * ప్రజాసేవలో రాణించేందుకు ఆశీర్వదించాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు పిలుపు. ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 21: ఎక్కడా జరగని విధంగా రక్తసంబంధాలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తూ గడల వంశీయులు, వారి ఆడబిడ్డల కుటుంబాల ఆత్మీయ కలయిక బుధవారం ఖమ్మంలో అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వంశీయులు, ఆడబిడ్డలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ హెల్త్ డైరెక్టర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గడల పెద్దల ఆలోచనలతో రూపుదిద్దుకున్న...