ఎంపీ వద్దిరాజు ఖమ్మంలో 22వతేదీన వామపక్షాలతో కలిసి తలపెట్టిన ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలి రావలసిందిగా బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 21: నిరుపేదలకు ఇండ్లు కేటాయించే విషయంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఇందుకు నిరసనగా వామపక్షాలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఈనెల 22వతేదీ గురువారం ఉదయం తలపెట్టిన ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన సన్నాహాక సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,జేడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితర నాయకులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ...