దసరా వేడుకల్లో మంత్రి "పొంగులేటి శ్రీనివాసరెడ్డి"
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 21: దసరా పర్వదినం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామం నారాయణపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. *అనంతరం సత్తుపల్లి మండలం రేజర్లలోని దుర్గా నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో శివాద్రి గిరి ప్రదక్షిణను ప్రారంభించి, స్వామివారిని దర్శించుకున్నారు. *కుటుంబ సమేతంగా జమలాపురం వేంకటేశ్వరస్వామి, తక్కెళ్లపాడు లలితా రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. *అలాగే ఇల్లెందులో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.