కోదాడలో ఘనంగా అమిత్ షా జన్మదిన వేడుకలు
కోదాడ అక్టోబర్ 22 (ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా, కోదాడ: పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో బీజేపీ యువ నాయకుడు ఏపూరి సత్యరాజు మాదిగ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ప్రవాస్ కన్వీనర్ జల్లా జనార్ధన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమిత్ షా దేశ ఐక్యత, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధిలో, దేశ రాజకీయాల్లో అమిత్ షా అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోదుమూరు...