తెలంగాణలో కరువు మండలాలను ప్రకటించాలి
పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మట్టపల్లి అంజయ్య అనంతగిరి అక్టోబర్ 22 (ఆర్యాద్వి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్)తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కా॥మట్టపల్లి అంజయ్య బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం,బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వలన ఈ సంవత్సరం తెలంగాణలో సగటు వర్షపాతం కంటే దాదాపు 23% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు.దీంతో రాష్ట్రంలోని 18జిల్లాల్లో 320మండలాలు పరిధిలోని 12760గ్రామాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని,వీటిలో 11479గ్రామాల్లో...