పేదల పక్షాన నిలిచి పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

కలెక్టరేట్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 22: పేద ప్రజల పక్షాన నిలిచి, అణగారిన వర్గాల కోసం పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. గురువారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాటం చేశారని తెలిపారు. పండుగ సాయన్న కేవలం సంపన్నుల నుంచి ఆస్తులను తీసుకొని పేదలకు పంచి పెట్టడానికే పరిమితం కాకుండా, ఆనాటి పాలనలోని అధికార వ్యవస్థను ప్రశ్నించి,...