వాస్తు ప్రకారం ఇంట్లో ఫ్రిజ్ ఎక్కడ పెట్టాలి? ఈ విషయాలు తెలుసుకోండి!

ఇంట్లో నిత్యం ఉపయోగించే గృహోపకరణాల్లో ఫ్రిజ్‌ ఒకటి. పాలు, కూరగాయలు, పండ్లు, వండిన ఆహార పదార్థాలను తాజాగా ఉంచేందుకు దీనిని ఉపయోగిస్తారు. అయితే ఫ్రిజ్‌ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయకుండా, సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ముఖ్యం. వాస్తు నమ్మకాలను అనుసరించే వారు ఫ్రిజ్‌ను ఏ దిశలో ఉంచాలనే విషయంపై కూడా ఆసక్తి చూపుతుంటారు. పడమర దిశలో ఉంచడం మంచిదని వాస్తు నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిజ్‌ను పడమర దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, కుటుంబ శ్రేయస్సు పెరుగుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఒక నిర్దిష్ట దిశలో ఫ్రిజ్‌ను ఉంచడం వల్ల...