పాఠశాల సామాగ్రి ధ్వంసం - దుండగులపై కఠిన చర్యలు తప్పవు : ఎస్సై ఏడుకొండలు

అనంతగిరి, అక్టోబర్ 24 (ఆర్యాద్వి): మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు సామాగ్రిని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అనంతగిరి ఎస్సై ఏడుకొండలు హుటాహుటిన పాఠశాలను సందర్శించి, ధ్వంసమైన సామాగ్రిని, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, నిందితులపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితుల గుర్తింపుకు చర్యలు...