- ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి సతీమణి మాధురి..
దానవాయిగూడెం: అక్టోబర్, 17:

పాలేరు నియోజకవర్గం దానవాయిగూడెం 59 వ, డివిజన్ లో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ "చల్లా కృష్ణ " ఆహ్వానం మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి "సతీమణి మాధురి" అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన కుంకుమపూజ, మహా అన్నదాన, కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా "పొంగిలేటి మాధురి" మాట్లాడుతూ, అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో "చల్లా కృష్ణ" మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


