Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో పలు దుర్గామాత మండపాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు

Author
Posted By ARYADVI NEWS
| 19 Oct 2026, 09:41 AM | TELANGANA
ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో పలు దుర్గామాత మండపాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 18:


బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం సాయంత్రం కొత్తగూడెంలో పలు దుర్గామాత మండపాలను సందర్శించారు,సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు హాజరయ్యారు.చుంచుపల్లి మండలం నంధా తండా,బంజారాకాలనీ,53వ డివిజన్ మేధర్ బస్తీ, పాల్వంచ 7వ డివిజన్ తదితర చోట్ల దుర్గామాత మండపాలను సందర్శించి అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భాలలో ఎంపీ రవిచంద్ర వెంట కార్పోరేటర్లు గోవాడ గుణచరిత్,సింధూతపస్వి, బీఆర్ఎస్ నాయకులు భీమా శ్రీధర్,డిష్ నాయుడు,కన్ని రాజేష్, మహేష్ తదితరులు ఉన్నారు.ఎంపీ వద్దిరాజును శాలువాలతో సత్కరించారు.