ఘనంగా బతుకమ్మ వేడుకలు
అనంతగిరి అక్టోబర్ 18 (ఆర్యాద్వి): మండల పరిధిలోని పాలవరం గ్రామంలో ఆదివారం బోరింగ్ బజార్ లో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి, ఆటపాటలతో వేడుకలకు శోభ తెచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ వలయాకారంగా నిలిచి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
ఇవి కూడా చదవండి
బంతి, చేమంతి, గునుగు, తంగేడు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు వేడుకలకు మరింత సౌందర్యాన్ని తెచ్చాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళల ఉత్సాహాన్ని అభినందించారు.


