బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల గోవిందరావు
అక్టోబరు 19
బిజెపి మండలం క్యాంపు కార్యాలయంలో సోమవారం మండలం ప్రజలకు, ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరావు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దుష్టశక్తులుపై దైవిక శక్తులు సాధించిన విజయానికి, ధర్మసంస్థాపనకు దసరా పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. జగన్మాత అయిన దుర్గాదేవిఅమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు,అష్టఐశ్వర్యంతో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోవాలని, ముఖ్యంగా రైతాంగం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరారు. సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం మరింత పరిఢవిల్లాలని, విజయదశమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించి విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా , మండల, గ్రామాలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


