Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పేద విద్యార్థుల విద్యాప్రదాత ఎస్‌ఆర్‌ శంకరన్

Author
Posted By ARYADVI NEWS
| 23 Oct 2026, 09:21 AM | TELANGANA
పేద విద్యార్థుల విద్యాప్రదాత ఎస్‌ఆర్‌ శంకరన్

--- గురుకుల విద్యా వ్యవస్థకు పునాది వేసిన దార్శనికుడు..
--- ఉచిత విద్య, వసతి, సమాన అవకాశాల కల్పనలో ఎస్‌.ఆర్‌ శంకరన్ సేవలు చిరస్మరణీయం
--- స్వేరోస్ జిల్లా అధ్యక్షులు కోండ్రు రామచంద్రు

ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 22:

పేద విద్యార్థుల విద్యాప్రదాత ఎస్‌.ఆర్‌ శంకరన్ అని, ఉచిత విద్య, వసతి, సమాన అవకాశాల కల్పనలో ఆయన సేవలు చిరస్మరణీయమని స్వేరోస్ జిల్లా అధ్యక్షులు కోండ్రు రామచంద్రు అన్నారు.

ఇవి కూడా చదవండి

ఖమ్మం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గురువారం ఎస్‌.ఆర్‌ శంకరన్ 92వ జయంతి, స్వేరోస్ డే లను పురస్కరించుకొని స్వేరోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌.ఆర్‌ శంకరన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్ తో కలసి స్వేరోస్ జిల్లా అధ్యక్షులు కోండ్రు రామచంద్రు స్వేరోస్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీనియర్ స్వేరోస్ నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు.. కులం, ఆర్థిక స్థితిగతులు, సామాజిక వివక్ష పిల్లల భవిష్యత్తుకు అడ్డంకులు కావద్దు.. పేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన జీవితాన్ని సాధించాలనే ఆశయాలతో తన జీవితాన్ని సామాజిక సేవకు అంకితం చేసిన గొప్ప పరిపాలనా దార్శనికుడు డాక్టర్‌ ఎస్‌.ఆర్‌ శంకరన్‌ అని కొనియాడారు. ప్రభుత్వ పదవిని అధికార ప్రదర్శనకు కాకుండా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించిన ఆయనను ప్రజలు ప్రేమతో 'పేదల ఐఏఎస్‌ అధికారి'గా గుర్తుచేసుకుంటున్నారన్నారు. డాక్టర్‌ ఎస్‌.ఆర్‌ శంకరన్‌ 1934 అక్టోబర్‌ 22న జన్మించారని అన్నారు. ఆయన 92వ జయంతి సందర్భంగా విద్య, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం చేసిన ఎస్‌.ఆర్‌ శంకరన్‌ సేవలను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరం అన్నారు.

పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో చదివే స్థోమత లేక నాణ్యమైన విద్యకు దూరమవుతున్న పరిస్థితులను మార్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1984లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అభివృద్ధికి శంకరన్‌ కృషి చేశారన్నారు.

పేదల కన్నీళ్లు తుడవడమే నిజమైన ప్రజాసేవగా భావించిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ జీవితం.. విద్యను హక్కుగా చూడాలని, సంక్షేమాన్ని సామాజిక బాధ్యతగా అమలు చేయాలని నేటి సమాజానికి చాటి చెబుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరోస్ నాయకులు పోలేపొంగు ఆంజనేయులు, మోదుగు నాగేశ్వరావు, కలకోట సంపత్, పిడమర్తి వెంకటేశ్వర్లు, శీలం ప్రసాద్, మందుల వెంకన్న, బండ్ల నాగేశ్వరరావు, డాక్టర్ పిసి వీరస్వామి, వంగూరి దశరద్, మేకల భాస్కర్, మందుల రమేష్, అప్పారావు, గౌతమ్, చిట్టీబాబు, మహేష్, గద్దల నాగరాజు, గుజ్జు కృష్ణ, మోదుగు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.