నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి
--విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పొదిల సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి యలమందల జగదీష్
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 22:
ఇవి కూడా చదవండి
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గవర్నర్ కోటాలో డాక్టర్ లోకేష్ యాదవ్ ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పొదిల సతీష్ యాదవ్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి, నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్ పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనూ , ఎన్ఎస్ యుఐ విద్యార్థి సంఘం నాయకుడు నుండి రాష్ట్ర అధికార ప్రతినిధి గా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడిన లోకేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ బిడ్డ జంపాల రాజేష్ లకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, మంత్రి పదవి కూడా ఒక్క బీసీకి కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల జనాభా శాతం ఎక్కువగా ఉన్నా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కరువైందని పేర్కొన్నారు. ఓట్లు మావి సీట్లు మీవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు న్యాయం చేయాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా బీసీల ఉద్యమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో నాయి బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బత్తుల వీరబాబు, పగడాల హనుమంతరావు, రాగం కోటి, నాగరాజు, వినయ్, వంశి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


