Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎల్ నినో పరిస్థితుల్లో పంటల పరిస్థితులను తెలుసుకొనుటకు సూర్యాపేట జిల్లా ను సందర్శించిన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్

Author
Posted By ARYADVI NEWS
| 17 Oct 2026, 06:09 PM | TELANGANA
ఎల్ నినో పరిస్థితుల్లో పంటల పరిస్థితులను తెలుసుకొనుటకు సూర్యాపేట జిల్లా ను సందర్శించిన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్

కోదాడ, అక్టోబర్ 17 (ఆర్యాద్వి):

వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ శనివారం కోదాడ మండలాన్ని సందర్శించారు.గుడిబండ లోని కాలిఫ్లవర్ రైతుల పొలాలను పరిశీలించి ప్రస్తుతమున్న ఎల్నినో పరిస్థితుల వల్ల రైతులు తగు జాగ్రత్తలు పాటించి పంటలు సాగు చేసుకోవాలని సూచించడం జరిగింది, ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు రైతులకు అందజేయాలనీ ఆదేశించడం జరిగింది, మరియు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వర్షాభావ పరిస్థితులు ఉండడం, కరెంట్ ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగా రానున్న రోజుల్లో కూరగాయలు కూడా దొరికే అవకాశం లేనందున రైతులు మొదటి ప్రాధాన్యతగా కూరగాయలు మరియు పశుగ్రాసం పంటలను సాగుచేయాలని మరియు ఎక్కడ ఐతే ఒకటి రెండు నీటి తడులు అవకాశం ఉన్నదో అక్కడ మాత్రమే ఆరుతడి పంటలు పప్పుధాన్యాలు పెసర, కంది, మినుము, జొన్నలు లాంటి పంటలు వేయాలని వరి పంట వేయొద్దని రైతులకు తెలియపరిచారు. మరియు నీటినీ పొదుపుగా వాడుకోవడం కోసం వ్యవసాయం లో స్ప్రింక్లర్, డ్రిప్ విధానాన్ని పాటించాలని తెలియచేసినారు. అదే విధంగా రైతులకు కావలసిన యంత్రపరికరాలు త్వరలో. సహకార సంఘాలు, FPo, మహిళా సంఘాల ద్వారా అందచేయడం జరుగుతుందని తెలియచేసినారు. రైతు వేదికల ద్వారా ఎప్పటికప్పుడు ప్రస్తుతమున్న ఎల్నినో పరిస్థితుల గురించి రైతులకు అవగాహనా కల్పించాలని తెలిపారు,రైతులు మాకు సబ్సిడీ పై విత్తనాలు అందజేయాలనీ ప్రిన్సిపల్ సెక్రటరీ ని కోరడం జరిగింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా రైతుల పొలాలను సందర్శించి పలు సూచనలు చేయడం తో రైతులందరు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారిణి పాలెం రజని, ఉద్యాన శాఖ అధికారి అనిత, వ్యవసాయ అధికారి రాజు, ఏఈఓ లు మహేష్, నగేష్,పిచ్చయ్య, ఉద్యాన విస్తరణ అధికారి ఇస్మాయిల్,సొసైటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మరియు రైతులు ఖాజామియా, రఫీ, గౌసుద్దిన్ తదితరులు పాల్గొన్నారు