Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

సర్పంచ్ ఇంటి ముందే బురద రోడ్డు.. అమలుకు నోచుకోని అభివృద్ధి!

Author
Posted By ARYADVI NEWS
| 18 Oct 2026, 07:02 PM | TELANGANA
సర్పంచ్ ఇంటి ముందే బురద రోడ్డు.. అమలుకు నోచుకోని అభివృద్ధి!

అధికారుల కళ్లకు కనిపించడం లేదా? అమీనాబాద్‌లో అధ్వానంగా రహదారి!
ఇదేనా అభివృద్ధి? బురదలో కూరుకుపోతున్న అమీనాబాద్!
అమీనాబాద్‌లో రహదారి దుస్థితి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

అనంతగిరి అక్టోబర్ 18 (ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో రహదారి దుస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
గ్రామంలో స్థానిక సర్పంచ్ ఇంటి ముందున్న ప్రధాన రహదారే బురదమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అడుగడుగునా గుంతలు, బురద పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు. పాదచారులు నడవలేని పరిస్థితి నెలకొంది.

సర్పంచ్ ఇంటి ముందే బురద రోడ్డు.. అమలుకు నోచుకోని అభివృద్ధి! - Additional Image

సర్పంచ్ ఇంటి ముందే రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, గ్రామంలోని ఇతర వీధుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు