Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: ఆమదాలవలస సిఐ

Author
Posted By ARYADVI NEWS
| 19 Oct 2026, 07:39 PM | Array
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు:  ఆమదాలవలస సిఐ

సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి | ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు

* సరుబుజ్జిలి న్యూస్ :అక్టోబర్ 19:* ​స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఆమదాలవలస సబ్-డివిజన్ పరిధిలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు సి ఐ సన్యాసి నాయుడు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ ) నిబంధనల ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు తేది.14.10.2026 నుంచి క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.
​ఈ సందర్భంగా ఆయన జారీ చేసిన కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు:
సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు: ఆమదాలవలస నియోజకవర్గం వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. పోలీస్ శాఖ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు నిర్వహించడం లేదా మైక్ సెట్లు/లౌడ్‌స్పీకర్లు వినియోగించడం చట్టరీత్యా నేరం.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ ): గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు మరియు కార్యకర్తలు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని తు.చ. తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై అనధికారిక ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడ రాతలను అనుమతించబోము.
ప్రలోభాలపై నిఘా: ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువుల పంపిణీకి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తాము. అక్రమ రవాణా, నిల్వలపై ప్రత్యేక నిఘా బృందాలు (ఎ ఫ్ ,టి ఎస్ ఎస్ టి ) 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము.
శాంతిభద్రతల పరిరక్షణ: ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా సహించే ప్రసక్తే లేదు. రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుంది.
​"ప్రజాస్వామ్య పండుగలాంటి ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో, చట్టబద్ధంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాము."