Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మద్యం దుకాణాల్లో సిండికేట్ దందా..

Author
Posted By ARYADVI NEWS
| 19 Oct 2026, 07:42 PM | ANDHRA PRADESH
మద్యం దుకాణాల్లో సిండికేట్ దందా..

*క్వార్టర్ బాటిల్‌ పై అదనపు వసూళ్లతో సామాన్యుల దోపిడీ!
* లైసెన్స్ షాపులలోనే ప్రతి బాటిల్ పై 10/ అదనపు వసూళ్ళు...

సరుబుజ్జిలి న్యూస్ అక్టోబర్ 19
నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, కొన్ని సరుబుజ్జిలి మండలంలో ప్రాంతాల్లో దుకాణదారుల అక్రమాలు, సిండికేట్ పద్ధతులు సామాన్య వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. మండం లో వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల యాజమాన్యం కుమ్మక్కై (సిండికేట్ అయి), ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి 180 ఎమ్ఎల్ (క్వార్టర్) బాటిల్‌పై 10 నుండి అంతకంటే ఎక్కువగా అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సిండికేట్ రూపంలో సామాన్యులపై ఒత్తిడి
కొనుగోలుదారులు ఎమ్మార్పీ ధరల గురించి ప్రశ్నిస్తే, దుకాణాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, లేదంటే మద్యాన్ని విక్రయించడానికి నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే క్వార్టర్ బాటిళ్లపై ఈ అదనపు వసూళ్ల దందా నిరాటంకంగా సాగుతోంది. ప్రతి బాటిల్‌పై రూ. 10 చొప్పున అదనంగా వసూలు చేయడం ద్వారా దుకాణదారులు రోజుకు వేల రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు.
ప్రభుత్వం మరియు ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం దుకాణాల్లో కేవలం ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నప్పటికీ స్థానిక ఎక్సైజ్ సిబ్బంది, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణదారులపై ఎలాంటి ఆకస్మిక తనిఖీలు చేపట్టకపోవడం, ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, ప్రజాప్రతినిధులు కూడా ఈ దోపిడీని పట్టించుకోకపోవడం పట్ల సామాన్య ప్రజలు, వినియోగదారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా కఠిన చర్యలు తీసుకోవాలి అని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిండికేట్ దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు తక్షణమే దాడులు నిర్వహించి, లైసెన్సులు రద్దు చేయాలి.
సామాన్యుల పై బారం మోపి నడ్డివిరుస్తున్న ఈ అదనపు ధరల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు...