Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఇద్దరికి చూపునివ్వనున్న వెంకటేష్‌–రమ్య దంపతులు!

Author
Posted By ARYADVI NEWS
| 20 Oct 2026, 08:59 AM | TELANGANA
ఇద్దరికి చూపునివ్వనున్న వెంకటేష్‌–రమ్య దంపతులు!

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. కుటుంబ సభ్యుల నిర్ణయంపై అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు ప్రశంసలు..

సింగరేణి: అక్టోబర్: 19,
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన మధ్యబోయిన వెంకటేష్‌–రమ్య దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ విషాద సమయంలోనూ వారి కుటుంబ సభ్యులు దంపతుల నేత్రాలను దానం చేసేందుకు ముందుకు రావడం అందరి హృదయాలను కదిలించింది. వారి నేత్రదానం ద్వారా మరో ఇద్దరికి చూపు లభించే అవకాశం కలగడం అభినందనీయమని పలువురు కొనియాడారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో దంపతుల మృతదేహాలను అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పరామర్శించి ఘనంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దంపతుల మృతి తీరని లోటని, ఇలాంటి దుర్ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర విషాదంలోనూ నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల నిర్ణయం గొప్పదని, వారి ఉదారత మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.దంపతుల మృతితో గాదెపాడు గ్రామంతో పాటు కారేపల్లి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మండల ప్రజలంతా అండగా నిలవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల మాజీ ఎంపీపీ బానోత్ దేవల నాయక్‌, సిపిఎం జిల్లా కొండెబోయిన నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు అడ్డగోడ ఐలయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొండబోయిన నాగేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షుడు మేకల మల్లికార్జున, మాజీ సొసైటీ డైరెక్టర్ కడప పుల్లారావు, వెటర్నరీ డాక్టర్ ఉపేందర్‌, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని దంపతులకు నివాళులర్పించారు.