19 ఏళ్ల వలస యువకుడికి తీవ్ర గాయాలు ఖమ్మం తరలింపు
దాడి చేసిన వ్యక్తి పై పోలీస్ కట్టిన చర్య తీసుకోవాలి..
- వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండేబోయిన నాగేశ్వరరావు డిమాండ్..
సింగరేణి: అక్టోబర్, 21:
ఇవి కూడా చదవండి
పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన 19 ఏళ్ల వలస కూలీపై దాడి జరిగిన ఘటన సింగరేణి మండలంలో కలకలం రేపింది.మాణిక్యారం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో రాజు (19) అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు.స్థానికుల కథనం ప్రకారం..బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రం నుంచి వచ్చి మాణిక్యారం ప్రాంతంలో కూలి పని చేసుకుంటున్న రాజు పై అదే గ్రామానికి చెందిన ఓ రైతు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.దాడిలో తీవ్రంగా గాయపడిన రాజు ను స్థానికులు వెంటనే కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా పోలీస్ వారు వివరాలు సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం,గాయాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం కారేపల్లి లో అంబులెన్స్లు అందుబాటులో లేక ఆటోలో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
పొట్టకూటి కోసం వస్తే.. దాడా? కారుకులపై కఠిన చర్య తీసుకోవాలి కొండబోయిన నాగేశ్వరరావు
కుటుంబాన్ని పోషించుకునేందుకు సుదూర ప్రాంతం నుంచి వచ్చి కూలి పని చేసుకుంటున్న వలస కూలి రాజు (19) పై మాణిక్యరం గ్రామానికి చెందిన భూక్య కోటయ్య అనే రైతు. దాడి చేయడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన రాజుని తీసుకొని ఘటనపై కారేపల్లి పోలీసులకు సహచర కూలీలు స్థానికులు ఫిర్యాదు చేయుటకు వస్తే కేసు నమోదు చేయకుండా. దాడికి పాల్పడిన రైతు ని స్టేషన్ కి రప్పించకుండా. గాయపడిన కూలిని హాస్పటల్ తీసుకెళ్లమని పోలీస్ శాఖ సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని. కూలి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై విచారణ జరిపి దాడికి పాల్పడిన రైతుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలని రప్పించుకొని వారికున్న ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకుని. అతి తక్కువ కూలి ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకోవడమే కాకుండా ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని. గత కొద్దిరోజుల క్రితం కూడా సంబంధిత రైతు. వలస కూలి రాజు పై దాడి చేయగా అతను సంబంధిత వ్యక్తి దగ్గర కూలి పని మానివేసి మరొక రైతు వద్దకు వెళ్లి పనిచేస్తున్నాడని కుట్రతో తన వద్ద పని మానేశాడు కక్షపూరితంగానే దాడి చేసి తీవ్రంగా గాయపరచడం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తుందని దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం పాటు గాయపడిన రాజు వైద్య ఖర్చులు మొత్తమును దాడికి పాల్పడిన రైతు చెల్లించి మెరుగైన వైద్యం అందించేలా పోలీస్ వారు చర్యలు తీసుకొని భవిష్యత్తులో పేదలైన కూలీలపై దాడి లాంటి ఘటనలు నివారించాలని ఆయన కోరారు ఈ ఘటన ఖండించిన వారిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సింగరేణి మండల అధ్యక్ష కార్యదర్శులు కేశగాని ఉపేందర్ యనమనగండ్ల రవి తదితరులు ఉన్నారు


