Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

తెలంగాణలో కరువు మండలాలను ప్రకటించాలి

Author
Posted By ARYADVI NEWS
| 23 Oct 2026, 09:20 AM | ANDHRA PRADESH, TELANGANA
తెలంగాణలో కరువు మండలాలను ప్రకటించాలి

పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి

ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మట్టపల్లి అంజయ్య

అనంతగిరి అక్టోబర్ 22 (ఆర్యాద్వి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్)తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కా॥మట్టపల్లి అంజయ్య బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం,బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వలన ఈ సంవత్సరం తెలంగాణలో సగటు వర్షపాతం కంటే దాదాపు 23% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు.దీంతో రాష్ట్రంలోని 18జిల్లాల్లో 320మండలాలు పరిధిలోని 12760గ్రామాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని,వీటిలో 11479గ్రామాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై పంటలు ఎండిపోయాయని తెలిపారు.దాదాపు 12లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని,బోర్లు,బావులు ఎండిపోగా తాగునీటికి,వ్యవసాయానికి నీరు లేక రైతులు,కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం సుండి ఎటువంటి కరువు సహాయక చర్యలు లేకపోవడం ఆందోళనకరమన్నారు.నిత్యం 3నుండి 5గంటల వరకు విద్యుత్ కోతలు కోనసాగుతుండగా రైతులు పంటలకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు.ఇదే పరిస్థితి కొనసాగితే 7635కోట్ల కరెంట్ బిల్లులను ప్రభుత్వం నుండి వలస ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులంపై పంపు పెట్టబడి వ్యయం పెరిగి,దిగుబడి పడిపోయి,ఉన్న దిగుబడి పడిపోయి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు.వెంటనే తెలంగాణ ప్రభుత్వం ప్రభావిత 18జిల్లాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు సంట నష్టపరిహారం ఎకరాకు కనీసం రూ.25,000/-చొప్పున అందించాలన్నారు.రైలీలకు ఉపాధి కూలీ పనులు కల్పించాలని,పశువులకు మేత,తాగునీరు సరఫరా ఏర్పాటు చేయాలని,విద్యుత్ కోతలను,రైతులపై మోపే నివారించి వ్యవసాయానికి నిరంతరాయంగా 9గంటల ఉచిత విద్యుత్ సరఫరా,భారీల సెంపును బేషరతుగా నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు.సంట నష్టపోయిన రైతుల సంట రుణాలు వడ్డీ కొనరారా రుణాలు వడ్డీ రహితంగా రీషెడ్యూల్ చేసి రికవరీలను నిలుపుదల చేయాలని కోరారు.ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్)ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేయబడునని హెచ్చరించారు

ఇవి కూడా చదవండి