మహబూబాబాద్: అక్టోబర్, 22:
కొమరం భీం ఆశయాలతో ముందడుగు. స్ఫూర్తితో వెళ్దాం వేద్దాం.
ఆదివాసి గిరిజన హక్కుల కోసం పోరాటం చేయాలి, గిరిజన సామాజిక చైతన్య వేదిక గుగులోత్ కిషన్ నాయక్, గురువారం మహబూబాద్ పట్టణంలోని కొమరం భీం విగ్రహం సమీపంలో కొమరం విగ్రహం వద్ద ఆదివాసి హక్కుల పోరాట యోధుడు జల్ జంగిల్ జమీన్ పోరాట స్ఫూర్తి దాత కొమరం భీమ్ జయంతి సందర్భంగా దళిత గిరిజన విద్యార్థి ప్రజా సంఘాల సారధ్యంలో కొమరం విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఘనంగా చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్ మాట్లాడుతూ గిరిజన హక్కులు చట్టాలు పిసా చట్టం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం, అడవి హక్కుల చట్టం, ఐదు ఆరు, షెడ్యూల్లో ప్రత్యేక చట్టాలను అమలు కోసం కొమరం భీమ్ స్ఫూర్తితో గిరిజన హక్కుల కోసం పోరాటానికి ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని కిషన్ నాయక్ పిలుపునిచ్చారు అడవిలో ఉన్న ఆదివాసులను అడవిలో ఉన్న ఖనిజాల పేరిట కార్పొరేట్ సంస్థలకు అడవిలో ధారవత్తం చేయడం అడవిలో ఉన్న ఆదివాసులను మానవ హోమం చేయడం అడవి నుండి తరివేయడం వారి ఆదివాసులను నిరాస్త్రులుగా చేయడం సిగ్గుచేటని అన్నారు సర్వహక్కులు అడవిలో ఉన్న ఆదివాసులనని ఈ వ్యవస్థకు ఈ సమాజానికి ఆక్సిజన్ లాంటి ఆదివాసులను అనడం బాధాకరమని వెంటనే ఆదివాసీలో మీద జరుగుతున్న దాడులను అత్యాచారాలను ఆపాలని ఆదివాసి చట్టాలను అమలు జరపాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న నాయక్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాగంటి ప్రభాకర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాపట్ల వీరన్న, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి దుంపల్లి అనిల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దేవత్ హేమానాయక్, ఎన్ హెచ్ పి ఎస్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు మంగీలాల్ నాయక్, విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు పోలేపాక వెంకన్న, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు నాయక్, సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ నాయకులు మోతిలాల్ నాయక్, సుమలత పద్మ శ్రీలత తదితరులు పాల్గొని కొమరం భీం టు ఘనంగా నివాళులర్పించడం జరిగింది...
గిరిజన హక్కుల కోసం కొమరం భీమ్ స్ఫూర్తితో పోరాటం చేయాలి, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు కిషన్ నాయక్ పిలుపునిచ్చారు.