Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పేదల పక్షాన నిలిచి పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

Author
Posted By ARYADVI NEWS
| 23 Oct 2026, 09:28 AM | TELANGANA
పేదల పక్షాన నిలిచి పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

కలెక్టరేట్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 22:

పేదల పక్షాన నిలిచి పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ - Additional Image


పేద ప్రజల పక్షాన నిలిచి, అణగారిన వర్గాల కోసం పోరాడిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న అని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

ఇవి కూడా చదవండి

గురువారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాటం చేశారని తెలిపారు. పండుగ సాయన్న కేవలం సంపన్నుల నుంచి ఆస్తులను తీసుకొని పేదలకు పంచి పెట్టడానికే పరిమితం కాకుండా, ఆనాటి పాలనలోని అధికార వ్యవస్థను ప్రశ్నించి, అధికారులను ఎదిరించారని తెలిపారు. తనదైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రయత్నించారని వివరించారు. ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న జీవితం, ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, అధికారులు, కుల సంఘ నాయకులు ములకలపల్లి సంగమేశ్వర రావు, పిట్టల వెంకట నరసయ్య, రావుల హనుమంతరావు, అనంత రాములు, బైరు హరినాధ బాబు, లింగబోయిన లక్ష్మణ్, పిట్టల నాగేశ్వరరావు ముదిరాజ్, గోల్కొండ అంజయ్య, కొప్పెర జానకి రామయ్య, పొన్నెబొయిన స్వామి, సుంకర శ్రీనివాసరావు, నార్ల శేషయ్య, మామిడి వెంకటేశ్వర్లు, మేడారం వెంకటేశ్వర్లు, కొప్పెర ఉపేందర్, పొడగంటి రాంబాబు, మేకల సుగుణరావు, భద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.