Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పాఠశాల సామాగ్రి ధ్వంసం - దుండగులపై కఠిన చర్యలు తప్పవు : ఎస్సై ఏడుకొండలు

Author
Posted By ARYADVI NEWS
| 24 Oct 2026, 06:28 PM | TELANGANA
పాఠశాల సామాగ్రి ధ్వంసం - దుండగులపై కఠిన చర్యలు తప్పవు : ఎస్సై ఏడుకొండలు

అనంతగిరి, అక్టోబర్ 24 (ఆర్యాద్వి): మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు సామాగ్రిని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అనంతగిరి ఎస్సై ఏడుకొండలు హుటాహుటిన పాఠశాలను సందర్శించి, ధ్వంసమైన సామాగ్రిని, ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, నిందితులపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితుల గుర్తింపుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

సర్పంచ్ నందిగామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠశాల సదుపాయాలను నాశనం చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. పాఠశాల సామాగ్రి పూర్తిగా ధ్వంసం కావడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.